తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టిజెఎఫ్) వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అయినప్పటి నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ జేఏసి ఇచ్చిన ఆందోళనా కార్యక్రమాల్లో వరంగల్ జర్నలిస్టులు చురుగ్గా పాల్గొన్నారు.
ముఖ్యమైన ఆందోళనా కార్యక్రమాలు.........
2009 డిసెంబర్ 6: వరంగల్ నగరంలో రిలే దీక్షలు చేపట్టిన వివిద జేఏసి శిబిరాలను సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. బలిదానాలు వద్దంటూ ప్రెస్ క్లబ్ నుండి తెలంగాణ అమరుల స్థూపం వరకు ర్యాలి నిర్వహించారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షా శిభిరాలు సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. కాకతీయ యూనివర్శిటి ఎస్.డి.ఎల్.సి.ఇ. సెంటర్‌లో జరుగుతున్న విద్యార్థుల దీక్ష శిబిరాన్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి టిజెఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ ప్రసంగించారు.
2009 డిసెంబర్ 7: ఉస్మానియా యూనివర్సిటిలో పోలీసులు విద్యార్థులపై, జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడులు జరిపినందుకు నిరసనగా కాళోజి సెంటర్‌లో మానవహారం నిర్మించి నిరసన తెలిపారు.
2009 డిసెంబర్ 30: ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల జేఏసి ఆధ్వర్యంలో హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు మద్దతుగా ప్రెస్ క్లబ్ నుండి హన్మకొండ అశోకా సెంటర్, పబ్లిక్ గార్డెన్, నక్కల గుట్ట, బాలసముద్రం మీదుగా బహిరంగ సభా స్థలి వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.
2010 ఫిబ్రవరి 16: తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమర వీరులకు నివాళులు అర్పిస్తూ హన్మకొండ చౌరస్తాలో తెలంగాణ అడ్డా దగ్గర కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించిన జర్నలిస్టులు.
2010 మార్చి 7: తెలంగాణ కోసం జర్నలిస్టు సునీల్ బలిదానం. ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయాలంటూ లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
2010 మార్చి 8: బలిదానం చేసిన జర్నలిస్టు సునీల్ కుమార్ అంతిమ యాత్ర. వరంగల్ ఎంజిఎం సెంటర్ నుండి ములుగు రోడ్, హన్మకొండ చౌరస్తా మీదుగా అమరుల స్థూపం వరకు ర్యాలి. ప్రెస్ క్లబ్‌లో సునీల్ కుమార్ మృత దేహం ఉంచి నివాళులు అర్పించిన జర్నలిస్టులు. కేంద్ర మాజీ మంత్రి బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యా సాగర్ రావు, జెజెపి స్థానిక నాయకులు డాక్టర్ టి. రాజేశ్వర్ రావు, ఎం. ధర్మారావు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి టి. శ్రీనివాసరావు, న్యాయ వాదులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు పి. సుబ్బారావు, కె. రవీందర్ రెడ్డి ఇతర జేఏసి సంఘాల నాయకులు అంతిమ యాత్రలో సునిల్ కు నివాళులు అర్పించారు.
2010 డిసెంబర్ 5: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని టిజెఎఫ్ హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్‌లో నిర్వహించిన సదస్సుకు వరంగల్ జిల్లా నుండి 1000 మంది జర్నలిస్టులు హాజరయ్యారు.
2010 డిసెంబర్ 26`29: నెల్లూరులో జరిగిన ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర మహాసభలో వరంగల్ జిల్లా జర్నలిస్టులు తెలంగాణ గళం విప్పారు. యూనియన్‌లో ప్రత్యేక తెలంగాణ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే వరకు యూనియన్‌లో పదవులు తీసుకోమని చెప్పడమే కాక ఏ పదవికి వరంగల్ జిల్లా నుండి పోటీలో పాల్గొనలేదు. జిల్లా జర్నలిస్టులు పి.వి. కొండల్‌రావు, గటిక విజయ్‌కుమార్, బి. అమర్‌లు సభలో తెలంగాణ విషయంలో ఎపియుడబ్ల్యూజె వైఖరి పై మాట్లాడారు. మూడు రోజుల సభల్లో తెలంగాణ అంశమే హాట్ టాపిక్‌గా మారింది.
2011 జనవరి 6: శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన నివేదికతో పని లేకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టులు ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. టిజెఎఫ్ కో`కన్వీనర్ కె. మహేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి. వెంకట్, ప్రతినిధులు నూర శ్రీనివాస్, గునిశెట్టి విజయభాస్కర్, ఎన్. బుచ్చిరెడ్డి, ఎన్. జితేందర్, జి. విజయ్ కుమార్, ఎపిడబ్ల్యుజె వరంగల్ యూనిట్ అధ్యక్షులు బి. అమర్, జిఆర్ సంపత్ కుమార్, షానవాజ్, ఎస్. సదానందం, ఎర్ర విజయ్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సాయి ప్రదీప్ దీక్షల్లో పాల్గొన్నారు.
2011 ఫిబ్రవరి 20: హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో టిజెఎఫ్ మొదటి మహాసభ. డాక్టర్ జయశంకర్ ప్రారంభోపాన్యాసం చేశారు. టిజెఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ ప్రధానోపాన్యాసం చేశారు. వరంగల్ జిల్లా కన్వీనర్ కన్నా పరుశురాములు అధ్యక్షత వహించారు. కో`కన్వీనర్ కె. మహేందర్ నివేదిక సమర్పించారు. ఐజెయు నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. అమర్, వి. వెంకట్ రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జి. వెంకట్, కార్యదర్శి వి. నారాయణరెడ్డి పాల్గొన్నారు. టిజెఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు రమణ, పల్లె రవి కుమార్, రమేష్ హజారి, కవిత పాల్గొన్నారు.
పొలిటికల్ జేఏసి కన్వీనర్ ప్రొ. టి. పాపిరెడ్డి, తెలంగాణ జేఏసి వైస్ చైర్మన్ డి. జనార్ధన్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సెక్రెటరీ జనరల్ విమలక్క, టిజిఏ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, కెయు విద్యార్థి సంఘం నాయకులు ఇండ్ల నాగేశ్వర రావు, కె. వాసుదేవరెడ్డి, వరంగల్ నగర ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షులు పి. కోటేశ్వరావు ప్రసంగించారు.
ఫిబ్రవరి 10: ములుగు మండలం రాయిని గూడెం గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో జై తెలంగాణ నినాదాలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు.
ఫిబ్రవరి 16: తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద కెమెరా, వీడియో జర్నలిస్టుల ఒక రోజు దీక్ష ఎం. భిక్షపతి, నవీన్, చిన్న, రంజిత్, శ్రీనివాస్, కృష్ణ, శ్రీను, విజయ్, సంపత్ దీక్షలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 23: తెలంగాణా కోరుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర జరిగిన లక్ష నినాదాలు లక్ష నివాళులు కార్యక్రమ నిర్వహణకు టిజెఎఫ్ స్ఫూర్తిగా నిలిచింది. ప్రెస్ క్లబ్ నుండి అమరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించారు.
2011 మే 16 : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తు ఢల్లీికి బయలు దేరిన జిల్లాకు చెందిన 150 మంది జర్నలిస్టులు. మే 18న ఢల్లీి జంతర్ మంతర్‌లో ధర్నా చేసిన జర్నలిస్టులు.
2011 జూన్ 22: డాక్టర్ జయశంకర్ స్ఫూర్తి యాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన టిజెఎఫ్.
2011 జూన్ 24: డాక్టర్ జయశంకర్‌కు నివాళిగా హన్మకొండ చౌరస్తాలోని ‘తెలంగాణ అడ్డా’ నుండి అశోకా సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ.
2011 జూలై 12: జేఏసి పిలుపు మేరకు ప్రెస్ క్లబ్‌లో వంటావార్పు నిర్వహించిన జర్నలిస్టులు.
జూలై 22 : ఢల్లీిలో బలిదానం చేసిన యాదిరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రెస్ క్లబ్ నుండి తెలంగాణ అమరుల స్థూపం వరకు జర్నలిస్టుల ర్యాలి.